చిన్నారులు, మహిళలపై దాడులు చేసిన 632 మంది నిందితులపై నేర చరిత్రను తెరచి నిఘా పెంచుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు . ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ హత్య కేసు అనంతరం రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలు చేశామన్నారు. 49 జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉంటున్న 1600 మంది నిందితుల్లో 927 మంది ఆచూకీ తెలుసుకుని వారిపై నిఘా పెట్టామని డీజీపి వివరించారు. 2020లో మహిళల భద్రతకే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
9 స్కోచ్ అవార్డులు...
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 9 స్కోచ్ అవార్డులు దక్కటం గర్వకారణమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. డీఎస్‌సీఐ, జి-ఫైల్స్‌కు ప్రధాని ప్రశంసలు అందటం రాష్ట్ర పోలీసు పనితీరుకు నిదర్శనమన్నారు. పాకిస్తానీ వలపు వలలో చిక్కుకుని దేశ అంతర్గత భద్రత సమచారాన్ని చేరవేస్తోన్న ఏడుగురు నేవీ అధికారులను ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో చాకచక్యంగా పట్టుకున్నామని... మావోయిస్టు ల ప్రాబల్యంను తగ్గించామని డీజీపీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల మిస్టరీని ఛేదించినట్లు పేర్కొన్నారు.
2019లో కేసుల నమోదు వివరాలు...