బెజవాడలో అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం: డీజీపీ - బెజవాడ గ్యాంగ్ వార్ న్యూస్
బెజవాడ గ్యాంగ్ వార్లో నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించినట్లు డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని నగరవాసులకు ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తును వేగంగా చేస్తున్నారని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. విజయవాడలో ఈ తరహా సంఘటనలు జరగడం విచారకరమని... రౌడీలపై నిఘా పెంచుతామమని డీజీపీ స్పష్టం చేశారు.
![బెజవాడలో అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం: డీజీపీ dgp gautham sawang on vijayawada gang war](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7466993-717-7466993-1591218130763.jpg)
dgp gautham sawang on vijayawada gang war