ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

dgp letter to cs: పోలీసేతర విధులను మహిళా పోలీసులకు అప్పగించొద్దు - DGP Gautam Sawang latest news

పోలీస్‌, ఇతర శాఖల మధ్య తలెత్తిన వివాదంపై సీఎస్‌ అదిత్యనాథ్ దాస్​కు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. మహిళా పోలీసులకు, ఇతర శాఖల అధికారులు నేరుగా ఆదేశాలివ్వకుండా కట్టడి చేయాలన్నారు.స్టేషన్ హౌస్ ఆఫీసర్లే మహిళా పోలీసులకు విధులు కేటాయిస్తారన్నారు.ఇతర శాఖల అధికారులు పనులు అప్పగిస్తే సమన్వయ లోపం తలెత్తుతుందని స్పష్టం చేశారు.

dgp letter to cs
dgp letter to cs

By

Published : Sep 7, 2021, 2:57 AM IST

గ్రామ సచివాలయాల పరిధిలోని మహిళ పోలీసుల సేవల వినియోగంపై పోలీస్-ఇతర శాఖల మధ్య తలెత్తిన వివాదంపై డీజీపీ గౌతమ్ సవాంగ్... సీఎస్​ అదిత్యనాథ్ దాస్​కు లేఖ రాశారు. గ్రామ, వార్డు మహిళా పోలీసులకు నేరుగా ఇతర శాఖల అధికారులే విధులు అప్పగించడంపై డీజీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎస్ అదిత్యనాథ్ దాస్​కు లేఖ రాశారు. సచివాలయల్లో పని చేస్తున్న మహిళా పోలీసులకు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు నేరుగా ఆదేశాలివ్వకుండా కట్టడి చేయాలని లేఖలో సీఎస్​ను కోరారు. పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వకుండా ఇతర శాఖల అధికారులు గ్రామ మహిళ పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం సూచనలు జారీ చేయాలని డీజీపీ లేఖలో స్పష్టం చేశారు. ఇతర విభాగాలకు చెందిన పనులను, పోలీసేతర విధులను మహిళా పోలీసులకు అప్పగించొద్దని తేల్చి చెప్పారు. వాస్తవానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు విధులు కేటాయిస్తారన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దిశ యాప్ డౌన్ లోడ్ మహిళా గ్రూపుల మ్యాపింగ్, చైతన్య సదస్సుల నిర్వహణ తదితర విధులు మహిళా పోలీసులకు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు మహిళా పోలీసులకు పనులు అప్పగిస్తే సమన్వయ లోపం తలెత్తుతుందని స్పష్టం చేశారు. ఇది ఉద్యోగుల మధ్య విబేధాలకు దారి తీస్తుందని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details