ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమాచారం దాచిపెడితే కేసు నమోదు చేస్తాం: డీజీపీ - DGP Gautam Sawang vijayawada visit news

కోవిడ్​-19 (కరోనా వైరస్)​ వ్యాప్తిని అరికట్టేందుకు.. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారమివ్వాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

విజయవాడలో ఆకస్మిక తనిఖీ చేసిన డీజీపీ గౌతమ్​ సవాంగ్​
విజయవాడలో ఆకస్మిక తనిఖీ చేసిన డీజీపీ గౌతమ్​ సవాంగ్​

By

Published : Mar 30, 2020, 10:19 PM IST

విజయవాడలో ఆకస్మిక తనిఖీ చేసిన డీజీపీ గౌతమ్​ సవాంగ్​

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారమివ్వాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. గుట్టుగా దాచిపెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. సమాచారం ఇవ్వని వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు, బంధువుల పైనా కేసులు పెడతామని తెలిపారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరిస్తున్నారని... ఇదే రీతిలో మరికొన్ని రోజులు పాటించాలని డీజీపీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన 7 వేల మందికి పైగా కేసులు పెట్టామని ఆయన వివరించారు. విజయవాడలో పలు ప్రాంతాల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఇదీ చూడండి:పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details