ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళలకు జోహార్లు: డీజీపీ - విలేజ్ మహిళ పోలీసులు తాజా వార్తలు

కేవలం పురుషులు మాత్రమే చేయగలరన్న పనులను సైతం చేసి నిరూపిస్తున్న మహిళలను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థినులతో డీజీపి గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళా మూర్తుల సేవలను ఆయన కొనియాడారు.

dgp
డీజీపీ గౌతమ్ సవాంగ్

By

Published : Mar 9, 2021, 6:58 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థినులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ వృత్తులు, రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ.. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే పనులను సైతం చేసి నిరూపిస్తున్న వారిని డీజీపీ అభినందించారు. చెప్పులు కుట్టటం, ఆటోలు నడపటం, రిక్షా తొక్కటం, సిమెంట్ బస్తాలు మోస్తున్న మహిళల వీడియోలను ఆయన వీక్షించారు. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళల భద్రత కోసం ప్రతి ఒక్క గ్రామంలోనూ విలేజ్ మహిళ పోలీసులను నియమించి మారుమూల ప్రాంతాల్లోని మహిళా సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని విద్యార్థినులకు డీజీపీ చెప్పారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి.. నిందితులకు వేగంగా శిక్షలు అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ మొబైల్ అప్లికేషన్ తో రక్షణ కల్పిస్తున్నామని డీజీపీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details