విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి ఆలయ అధికారులు భక్తులను అనుమతిస్తున్నారు. రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం.. భక్తులకు ధర్మ, ముఖమండప దర్శనాలకు అవకాశం కల్పించారు. ఇందుకు టైంస్లాట్ పద్ధతిని ఎంచుకున్నారు. పరిమిత సంఖ్యలో చండీ హోమం, శాంతికల్యాణం, లక్షకుంకుమార్చన సేవలు జరిపించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మాస్కు ధరించిన భక్తులను మాత్రమే అమ్మవారి ఆలయ ప్రవేశానికి వీలు కల్పిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసాదం ప్యాకెట్లు అందిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు వీరికి స్వాగతం పలికారు.
టైంస్లాట్ పద్ధతిలో కనకదుర్గమ్మ దర్శనం - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి వార్తలు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని భక్తులు దర్శించుకునేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు టైంస్లాట్ పద్ధతిని అవలంభిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ... చండీహోమం, లక్షకుంకుమార్చన వంటి సేవలకు అధికారులు అవకాశం కల్పించారు.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి