DUSSEHRA AT VIJAYAWADA : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ.. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి దర్శనానికి రానున్న నేపథ్యంలో గంట ముందు నుంచే దర్శనాన్ని నిలిపి వేయనున్నారు.
మూలానక్షత్రం.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - సరస్వతీదేవి అలంకారం
RUSH AT VIJAYAWADA TEMPLE : మూలా నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తలు వేచి చూస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్యూలేన్లు నిండిపోయాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి దర్శనానికి రానున్న నేపథ్యంలో గంట ముందు నుంచే దర్శనాన్ని నిలిపివేయనున్నారు.
సరస్వతీదేవి అలంకారం విశిష్టత..:మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే సరస్వతీదేవి దర్శనం.. అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకమని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇవీ చదవండి: