Devotees Suffered With CM Tour : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వగా.. సీఎం దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సమయంలో దర్శనాలను నిలిపివేయగా.. భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి లైన్లలోనే ఉంటూ దర్శనం కోసం పడిగాపులు పడ్డారు.
ఇంద్రకీలాద్రిపై భక్తుల అవస్థలు.. సీఎం, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు - సీఎం డౌన్ డౌన్
Devotees Fires : అధికారుల ప్రణాళికా లోపంతో ఇంద్రకీలాద్రిపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు.. క్యూలైన్లలో అల్లాడిపోయారు. సీఎం వచ్చిన సమయంలో ఘాట్‌రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద పోలీసులు భక్తులను నిలిపివేయగా.. కొందరు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. సీఎం ఆలయం నుంచి వెళ్లే సయమంలోనూ వ్యతిరేక గళం వినిపించారు.

ఓంకారం మలుపు కిందకు ఉన్న క్యూలైన్‌లలో భక్తులను అధికారులు నిలిపివేయగా.. వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొందరు పిల్లలు దాహంతో అల్లాడిపోయారు. దగ్గరలోని వాలంటీర్లు అప్రమత్తమై వారికి మంచినీళ్ల ప్యాకెట్లు అందజేశారు. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు.. ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దర్శనానంతరం కొండపై నుంచి కిందికి వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డు రాజగోపురం పాయింట్ వద్ద క్యూలైన్‌లలో ఉన్నటువంటి కొందరు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. జై జనసేన జై పవన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం వెనక్కి చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: