రాష్ట్ర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (devineni uma) ఆరోపించారు. ఓచర్లు, బిల్లులకు లెక్కలు లేని రూ. 41 వేల కోట్లు మాయమయ్యాయన్నారు. ఈ వ్యవహారంపై ఆర్థిక మంత్రి బుగ్గన (finance minister buggana) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా కొటికలపూడిలో రైతులతో మాట్లాడిన ఆయన..అన్నదాతకు విత్తనాలు, పెట్టుబడి రుణాలు అందటం లేవని విమర్శించారు. తెదేపా (tdp) ప్రభుత్వ హయంలో రాని జలవివాదం (water war) ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. పక్కరాష్ట్రంలో మంత్రులు వైఎస్సార్‌ను బూతులు తిడుతుంటే ఏపీలో మంత్రులు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు.