కృష్ణా వరదల ప్రభావంతో రాష్ట్రంలో 90 మండలాలు, 484 గ్రామాల్లో రైతులు భారీగా నష్టపోయారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వరదలతో రూ.95 కోట్ల ఆర్థిక నష్టం జరిగితే... ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.37 కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణమని విమర్శించారు. రైతులు, వరద ముంపు బారిన పడిన ప్రజల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రైతులను మరింత కుంగదీసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలు వేసిన రైతులకు వేల కోట్లలో నష్టం జరిగితే... కేవలం రూ.228కోట్లు నష్టం జరిగినట్లు నివేదిక ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ నష్టం వాటిల్లిందన్న దేవినేని... నష్టపరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'రైతులను మరింత కుంగదీసేలా ప్రభుత్వ నిర్ణయం'
కృష్ణా వరదల కారణంగా రూ.95 కోట్ల ఆర్థిక నష్టం జరిగితే... ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.37 కోట్లు ఇస్తామని ప్రకటించడం ఏంటని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి... రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు