మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇసుక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరలిపోతోందని... మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇసుక కొరత ప్రభావం 30 లక్షల మందిపై పడిందన్న దేవినేని... ఇసుక కొరతపై కొల్లు రవీంద్ర దీక్ష తలపెడితే ప్రభుత్వం భయపడిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ పని తలపెడితే... పోటీగా అదే పని చేపడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క లక్షలాది మంది రోడ్డున పడుతున్నారని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర దీక్షకు మద్దతుగా మచిలీపట్నం వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
'మంత్రుల ఆధ్వర్యంలో ఇసుక తరలిపోతోంది' - devineni uma
రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభావం 30 లక్షల మందిపై పడిందని మాజీమంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర దీక్షకు మద్దతుగా మచిలీపట్నం వెళ్లనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు