పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బిల్లు ప్రతులను మాజీ మంత్రి దేవినేని ఉమా తగలపెట్టించారు. విద్యుత్ బిల్లుల వసూళ్ల కార్యక్రమాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
క్యాటగిరీలను ఏ నెలకు ఆ నెల విడదీయకుంటే ప్రజల తరఫున పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో ప్రభుత్వ చర్యలు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహించారు.