తనకు తెలియకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయంటూ ఉదయం నుంచి జగన్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ చేయని పనిని ఎన్నికల కమిషన్ చేసిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా నిరోధించడానికి సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని మండిపడ్డారు.
సీఎంగా జగన్ చేయని పని ఎన్నికల కమిషన్ చేసింది: దేవినేని - ఆంధ్రా ఎన్నికలు వాయిదా
ఎన్నికల వాయిదా మీద సీఎం జగన్ గవర్నర్ దగ్గరకు వెళ్లారే తప్ప... కరోనా గురించి మాత్రం చెప్పలేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాకపోతే మిగతా ఎమ్మెల్యేల్లో ఎవరినైనా.. ముఖ్యమంత్రిని చేయాలని హితవు పలికారు.
![సీఎంగా జగన్ చేయని పని ఎన్నికల కమిషన్ చేసింది: దేవినేని జగన్ చేయని పని ఎన్నికల కమిషన్ చేసింది: దేవినేని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6418217-227-6418217-1584284165438.jpg)
జగన్ చేయని పని ఎన్నికల కమిషన్ చేసింది: దేవినేని
జగన్ చేయని పని ఎన్నికల కమిషన్ చేసింది: దేవినేని