ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డాక్టర్ సుధాకర్​పై ప్రభుత్వం కక్ష కట్టింది: దేవినేని ఉమా

విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై దాడి ముఖ్యమంత్రి నియంతృత్వానికి పరాకాష్ఠ అని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా అని దుయ్యబట్టారు.

devineni uma on doctor sudhakar issue
devineni uma on doctor sudhakar issue

By

Published : May 17, 2020, 12:47 PM IST

డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్​ సుధాకర్... ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారన్నారు. డాక్టర్ల సేవలు మెచ్చుకుని.. పూల వర్షం కురిపిస్తుంటే, ఏపీలో మాత్రం చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం లాంటి హేయమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో సస్పెన్షన్​కు గురైన డాక్టర్ సుధాకర్‌ పట్ల ప్రభుత్వం కక్ష కట్టిందని దేవినేని ఉమా ఆరోపించారు. దళితుల పట్ల జగన్ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఉమా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details