లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలపై అక్రమకేసులు నమోదు చేయడం సర్కారు కక్షపూరిత వైఖరి అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వీసారెడ్డి, వైకాపా నేతలపై కేసులెందుకు పెట్టలేదో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'వైకాపా నేతలపై కేసులెందుకు పెట్టలేదు?' - సీఎం జగన్ పై దేవినేని ఉమా
లాక్ డౌన్ నింబంధనలు ఉల్లంఘించిన వైకాపా నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదని మాజీ మంత్రి దేవినేని ఉమా.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. పేదలకు సాయం చేసిన తెదేపా నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పై దేవినేని ఉమా