అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తున్నారని... ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. వైకాపా నాయకుని హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడంతో... ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులతో కలిసి దేవినేని ఉమ కొల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కొల్లు రవీంద్ర కుటుంబానికి దేవినేని పరామర్శ - కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దేవినేని
మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని మాజీమంత్రి దేవినేని ఉమ పరామర్శించారు. రవీంద్ర అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తామని ఉమ అన్నారు.
కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దేవినేని
అత్యంత నాటకీయ పరిణామాలతో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉమ తెలిపారు. కొల్లు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:సజ్జల దగ్గర విజయసాయి ఆస్తుల చిట్టా: వర్ల రామయ్య