సగం చించిన నోట్లతో ఓటర్లకు గాలం: దేవినేని ఉమా
కరెన్సీ నోట్లను చించి.. ఓటర్లకు పంచుతున్నారు : దేవినేని ఉమా - కొండపల్లి మున్సిపాలిటీలో చిరిగిన కరెన్సీ
కృష్ణా జిల్లా కొండపల్లి మునిస్పాలిటీలో సగం చించిన నోట్లతో వైకాపా నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. వైకాపా నేతలు పది రూపాయలు, 20రూపాయల నోట్లను సగం చించి ఓటర్లకు పంచుతూ వాటిని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లిన వారికి పెద్దమొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని తప్పుబట్టారు. తమకు వైకాపా నేతలు సగం చించిన నోట్లు పంపిణీ చేశారంటూ స్థానికులు ఎన్నికల ప్రచారంలో దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లారు.

devineni uma fires on ycp