వైకాపా ప్రభుత్వం ఏం ఉద్ధరించిందని రైతు దినోత్సవం చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో కంటే బయటి మార్కెట్లోనే మంచి విత్తనాలు తక్కువ ధరకు దొరుకుతున్నాయన్నారు. పసుపు కొనుగోళ్లు సీఎంవో కార్యాలయ సిఫార్సులతో జరుగుతున్నాయని ఆరోపించారు.
ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ఉమ నిలదీశారు. రైతు దినోత్సవం కాదు రైతు సొమ్ము దుబారా దినోత్సవం జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో14 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే.. ఆయన జన్మదినం రోజున రైతు దినోత్సవ జరపడం ఏంటని మండిపడ్డారు.