చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును.. రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవటంపై తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాకుండా పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం జగన్ పిరికి చర్య అని దేవినేని విమర్శించారు. టీ కొట్టు నడుపుకునే వ్యక్తి కార్పొరేటర్‌గా పోటీ చేయడాన్ని తట్టుకోలేని వైకాపా నాయకులు.. అతని టీ కొట్టును కూల్చివేయటం దారుణమన్నారు.
రేణిగుంట ఘటనకు వైకాపానే కారణం: దేవినేని - చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవటంపై దేవినేని ఆగ్రహం
రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటంపై.. మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఇది సీఎం జగన్ పిరికి చర్య అని విమర్శించారు.
'చంద్రబాబును నేల మీద కూర్చునే స్థితికి తెచ్చింది వైకాపా ప్రభుత్వమే'