ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధైర్యం ఉంటే కేంద్రమంత్రి సమీక్ష వివరాలు చెప్పగలరా ?: దేవినేని - దేవినేని ఉమ తాజా వార్తలు

Devineni Uma On Polavaram: పోలవరం నిర్మాణంపై మంత్రి అనిల్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం పనుల్లో ఇప్పటికే మూడేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. డ్యామ్‌ నిర్మించకుండా ఎత్తిపోతలకు పునాదులు తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ

By

Published : Mar 10, 2022, 5:50 PM IST

Devineni Uma Comments On Polavaram:పోలవరంపై శాసనసభలో మంత్రి అనిల్ అసత్యాలతో మభ్యపెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం పూర్తికి మరో మూడేళ్లు పడుతుందని ప్రకటించి ప్రభుత్వం తన అసమర్ధతను చాటుకుందన్నారు. ఇప్పటికే మూడేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం మరో మూడేళ్లు సమయం పడుతుందంటున్నారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్​లో దెబ్బతిన్న భాగం పూర్తి చేసేందుకే జూన్ 2023 వరకు సమయం పడుతుందని మంత్రి ప్రకటించటం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఎర్త్​కమ్ రాక్​ఫిల్ డ్యాం నిర్మాణానికి కనీసం 2 సీజన్ల సమయం పడుతుందని.. డ్యాం నిర్మాణం చేపట్టకుండా లిఫ్ట్ ఇరిగేషన్​కు పునాదులు తవ్వుతున్నారని అన్నారు.

ధైర్యం ఉంటే ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చేసిన సమీక్ష వివరాలు చెప్పగలరా? అని దేవినేని ఉమా సవాల్‌ చేశారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి సింగిల్ టెండర్ వచ్చిన వారికే మళ్లీ పనులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారని మండిపడ్డారు. రెండేళ్లు మొద్దునిద్ర పోవటం వల్లే డయాఫ్రమ్ వాల్​కు రక్షణ లేకుండా పోయిందని దేవినేని దుయ్యబట్టారు.

"పోలవరంపై మంత్రి అనిల్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పోలవరం పనుల్లో ఇప్పటికే మూడేళ్లు కాలయాపన. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు కనీసం 2 సీజన్ల సమయం పడుతుంది. డ్యామ్‌ నిర్మించకుండా ఎత్తిపోతలకు పునాదులు తవ్వుతున్నారు. ధైర్యం ఉంటే కేంద్రమంత్రి సమీక్ష వివరాలు చెప్పగలరా ?. సింగిల్ టెండర్ వచ్చిన వారికే మళ్లీ పనులెలా కట్టబెట్టారు ?. కమీషన్ల కక్కుర్తితో రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. రెండేళ్ల నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్‌కు రక్షణ లేకుండా పోయింది."- దేవినేని ఉమ, తెదేపా నేత

ఇదీ చదవండి

Atchenna on Mining: మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details