ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులా ?: దేవినేని - దేవినేని ఉమా తాజా వార్తలు

అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా? అని మాజీ మంత్రి దేవినేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్థుడైన జగన్.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు.

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా?: దేవినేని
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా?: దేవినేని

By

Published : Nov 26, 2020, 3:42 PM IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రపంచంలోని ఆర్థిక నేరస్థుల జాబితాలో జగన్ 5వ స్థానంలో ఉంటాడని.., అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.

"రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. న్యాయ వ్యవస్థపై, రాజ్యాంగ వ్యవస్థపై బాధ్యత గల మంత్రులు ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతుంటే..ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గతంలో సుబాబులు టన్నుకు 4 వేలు ఇప్పిస్తే ఇప్పుడు రూ. 1,100 వచ్చే పరిస్థితి లేదు. ఇదే సుబాబులుపైన గతంలో పాదయాత్రలు, పోరాటాలు చేసిన అధికార పార్టీ నాయకులు నోరు ఎందుకు మెదపడం లేదో సమాధానం చెప్పాలి." అని ఉమా డిమాండ్ చేశారు.

పార్టీల పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా దారుణమని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

ఇదీచదవండి

వర్షాలు తగ్గగానే వరద నష్టంపై మదింపు: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details