వైకాపా పెద్దలు కమీషన్లు దండుకుని రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులను గాలికొదిలేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 29 నెలలైందని.. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ? అని నిలదీశారు.
'తెదేపా ప్రభుత్వ హయాంలో 62 ప్రాజెక్టులను చేపట్టి 23 పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 6 ప్రాజెక్టుల్లో దేనికెంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం మంత్రికి ఉందా ?. కేవలం రూ.6 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వంశధార, నాగావళిని పూర్తి చేయకుండా చేతకాని కబుర్లు చెబుతున్నారు. పోలవరంలో జలవిద్యుతుత్పత్తి ప్రారంభించి ఉంటే ఏటా రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల ఆదాయంతో పాటు 960 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరిగేది. నెల్లూరు సంగం బ్యారేజీ, వెలుగొండ టన్నెల్, అవుకు టన్నెల్ పనులు పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల పనులు ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని మీడియాలో వస్తే మంత్రి కోపంతో పత్రికల్ని నిందిస్తూ కుల రాజకీయాలు చేస్తున్నారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడకుండా గత 29 నెలల్లో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.' అని దేవినేని డిమాండ్ చేశారు.
వారి వ్యవహారశైలి పశువుల కంటే హీనం