వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు పనులు పర్యవేక్షణ కోసమే మంత్రి అనిల్ కుమార్ను సీఎం జగన్ పోలవరం పంపారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రూ.254 కోట్లతో పోలవరంలో 125 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ ఆరోపించారు. వరదల్లో మునిగిన ప్రజలకు మంచినీళ్ల ప్యాకెట్ కూడా ఇవ్వని ప్రభుత్వం, పోలవరం వద్ద వైఎస్ విగ్రహం పెడతామంటోందని విమర్శించారు. నిర్వాసితులను గాలికి వదిలేసి విగ్రహం పెట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు.
అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పోలవరంలో సాధించిన ప్రగతి వై.ఎస్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవటమే అని దేవినేని ఉమా అన్నారు. నీటి నిలువ సామర్థ్యాన్ని 150 అడుగులుగా ఉంచడం ముఖ్యమో, 125 అడుగుల వై.ఎస్ విగ్రహం ముఖ్యమో జగన్ సమాధానం డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రూ.11,537 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయంపై ప్రధానిని అడిగే ధైర్యం జగన్కు లేవన్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ భాష అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని దేవినేని ఉమా హితవు పలికారు.
రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించండి