ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మేనిఫెస్టోపై మాట తప్పి.. మడమ తిప్పారు' - వైకాాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శల వార్తలు

ఎన్నికల మేనిఫెస్టోపై వైకాపా ప్రభుత్వం మాట తప్పి, మడమ తిప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. 22 మంది ఎంపీలను పెట్టుకుని కూడా పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు.

devineni uma criticises ycp government
దేవినేని ఉమ

By

Published : Jun 1, 2020, 9:58 PM IST

ఎన్నికల హమీలు అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కేంద్రం నుంచి తెచ్చిన 70 వేల కోట్ల రూపాయలు ఏం చేశారో, ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఎందుకు ఆన్​లైన్​లో పెట్టడం లేదని ప్రశ్నించారు.

22 మంది ఎంపీలను పెట్టుకొని కూడా పోలవరానికి నిధులు తెచ్చుకోవడం చేతకాలేదని దేవినేని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో ఇచ్చిన కాంట్రాక్టర్ లంకారెడ్డి ఎవరని ప్రశ్నించిన ఆయన.. కడప జిల్లా అని ఇచ్చారా లేక బంధువని ఇచ్చారా అని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్​పై కాంట్రాక్ట్ ఇవ్వడమా అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details