ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫేక్ ట్వీట్లతో మంత్రి అంబటి విష ప్రచారం'.. సీఐడీకి దేవినేని ఫిర్యాదు - దేవినేని తాజా వార్తలు

Devineni Uma complaint to CID: ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తూ విద్వేషాలు పెంచుతున్నారని మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన ట్విట్టర్ ఖాతాను మార్ఫింగ్ చేసి.. తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ ట్వీట్ల వెనుక సీఎం జగన్, సజ్జల ఉన్నారని దేవినేని ఉమ ఫిర్యాదులో వెల్లడించారు.

సీఐడీకి దేవినేని ఫిర్యాదు
సీఐడీకి దేవినేని ఫిర్యాదు

By

Published : Jun 7, 2022, 3:41 PM IST

TDP leader complaint on Minister Ambati Rambabu: మంత్రి అంబటి విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. సీఎం జగన్, సజ్జల నాయకత్వంలో కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టటంతో పాటు ట్వీట్లు మార్ఫింగ్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిని ఎప్పుడు అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకుంటే కోర్టుకెళ్తానని హెచ్చరించారు. ఈ కుట్రలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారని దేవినేని ఆక్షేపించారు.

సీఐడీకి ఫిర్యాదు:అనంతరం మంత్రి అంబటిపై డీజీపీ కార్యాలయంలో దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తూ విద్వేషాలు పెంచుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ట్విటర్ ఖాతా మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఫేక్ ట్వీట్‌ను తనకు ట్యాగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్న ఉమ.. ఫేక్ ట్వీట్ల వెనక జగన్, సజ్జల ఉన్నారని సీఐడీకి ఫిర్యాదు చేశారు. జగన్, సజ్జల, అంబటిపై చర్యలు తీసుకోవాలని దేవినేని సీఐడీని కోరారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details