రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలవుతోందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్న జగన్... ఏ బ్యాంకులో సున్నావడ్డీ కింద గత నాలుగు నెలల్లో రుణాలిచ్చారో చెప్పాలని నిలదీశారు. జగన్ మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం కార్యాలయం దాటడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ హయాంలో 14వేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే... జగన్ 4నెలల పాలనలో ఇప్పటి వరకూ 190మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
'సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలు చేస్తున్నారు..?' - సున్నా వడ్డీ పథకంపై దేవినేని ఉమ కామెంట్స్
సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలు చేస్తున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. గత నాలుగు నెలల్లో రుణాలిచ్చారో చెప్పాలని నిలదీశారు.
!['సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలు చేస్తున్నారు..?'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4763950-568-4763950-1571160335472.jpg)
మాజీమంత్రి దేవినేని ఉమ
Last Updated : Oct 16, 2019, 1:42 AM IST