ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా ఇన్​సైడర్ ట్రేడింగ్​పై సీబీఐతో విచారణ జరిపించాలి' - దేవినేని ఉమ

విశాఖ చుట్టుపక్కల వైకాపా నాయకులు 6వేల ఎకరాలను కొనుగోలు చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నేతల ఇన్​సైడర్ ట్రేడింగ్​పై సీబీఐతో విచారణ జరిపించాలని దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

devineni uma comments on ycp
వైకాపా పై విమర్శలు గుప్పించిన తెదేపా నేతలు

By

Published : Dec 18, 2019, 6:07 PM IST

వైకాపా పై విమర్శలు గుప్పించిన తెదేపా నేతలు

గత ప్రభుత్వ హయాంలో కేసులు వేసిన వైకాపా.. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో 5 వేల మంది రైతులకు ఇళ్ల నిర్మాణాలను తెదేపా ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. సీఎం, మంత్రుల విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. విశాఖ చుట్టుపక్కల వైకాపా నాయకులు 6వేల ఎకరాలను కొనుగోలు చేశారని... వైకాపా నేతల ఇన్​సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని దేవినేని, నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని ఉమ తెలిపారు. 13 జిల్లాల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి వస్తున్న వ్యాపారవేత్తలు వైకాపా అసమర్థ పాలన వల్ల ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details