ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం నిర్మాణ సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదు: దేవినేని

ప్రభుత్వ అసమర్థతతో పోలవరం నిర్మాణం ఆలస్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాజ్యసభలో ఎంపీ కనమేడల ప్రశ్నకు కేంద్రం సమధానమే అందుకు నిదర్శనమన్నారు. ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదని చెప్పారు.

పోలవరం నిర్మాణ సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదు
పోలవరం నిర్మాణ సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదు

By

Published : Jul 20, 2022, 3:50 PM IST

వైకాపా ప్రభుత్వం అసమర్థత వల్ల 2022కి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2024కి పొడిగించారని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. రాజ్యసభలో ఎంపీ కనమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి చెప్పిన సమాధానం వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణాన్ని 72 శాతం పూర్తి చేసి అప్పగిస్తే.. 37 నెలల వైకాపా పాలన వైఫల్యాల కారణంగా నిర్మాణం మరింత ఆలస్యమవుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదనే విషయం తేటతెల్లమైందన్నారు.

లోయర్ కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయటం వల్ల ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య పరిస్థితి జలాశయాన్ని తలపిస్తూ అగాధంలా మారిందన్నారు. జూన్, జులైలో వరదలు వస్తాయని జలవనరులశాఖ గమనించ పోవడం, దానికి ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్లే విలీన గ్రామాల ప్రజలు నీరు, ఆహారం, వసతులు, నీడ లేక అవస్థలు పడుతున్నారన్నారు. వరదలు, ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి జగన్ వివరించాలని దేవినేని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details