ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం పనులను తాకట్టుపెడితే ఊరుకోబోం: దేవినేని - దేవినేని ఉమా న్యూస్

కమీషన్ల కక్కుర్తి కోసం విశాఖకు పైప్ లైన్ అంటూ...పోలవరం ఎడమ కాలువ పనులను తాకట్టు పెడితే ఊరుకునేది లేదని మాజీమంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్​లో 194 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచి 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పోలవరం పనులను తాకట్టు పెడితే ఊరుకునేది లేదు
పోలవరం పనులను తాకట్టు పెడితే ఊరుకునేది లేదు

By

Published : Nov 27, 2020, 8:47 PM IST

కమీషన్ల కక్కుర్తి కోసం విశాఖకు పైప్​లైన్ అంటూ... పోలవరం ఎడమ కాలువ పనులను తాకట్టు పెడితే ఊరుకునేది లేదని మాజీమంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ అంగుళాలు, సెంటిమీటర్లు తగ్గినా... ప్రజలు ప్రభుత్వాన్ని పాతరేస్తారన్నారు. 27వేల కోట్ల పోలవరం నిర్వాసితుల డబ్బుల కోసం ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్​లో 194 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచి 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

వరదలు, అధిక వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేని పరిపాలన వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గ్రామ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం... రైతులు ఏ పంట వేశారో తెలుసుకొని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details