దమ్ము, దైర్యం ఉంటే పేకాటను ప్రొత్సహిస్తున్న కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా సీఎం జగన్కు సవాల్ విసిరారు. గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో పేకట శిబిరాలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. సీఎం జగన్ ప్రోత్సహంతోనే మంత్రి బూతులు మాట్లాడుతూ అధికారులను భయపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.
గత రాత్రి పేకాట శిబిరంలో కోట్ల రూపాయల డబ్బు దొరికితే...42 లక్షలు దొరికాయని డీఎస్పీ, 55 లక్షలు దొరికాయని ఎస్పీ చెబుతున్నారన్నారు. ప్రజలు మాత్రం 10 కోట్లు దొరికాయని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మిగిలిన డబ్బులు మిషన్లతో లెక్కించి తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్లాయా? అని ఆక్షేపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డికి, మంత్రి కొడాలికి వాటాల్లో తేడా వచ్చే సరికి పేకాట శిబిరాలు బయటకు వచ్చాయని విమర్శించారు. గడ్డం గ్యాంగ్ పేకాట డెన్లో ఒకరోజు టర్నోవర్ ఇరవైకోట్ల పైనే ఉంటుందన్నారు. పట్టుబడిన మెుత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.