ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ తీరు హిట్లర్ ఉదంతాన్ని తలపిస్తోంది: దేవినేని - సీఎం జగన్​పై దేవినేని కామెంట్స్

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కుల, మత, ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. జర్మనీ పార్లమెంట్ భవనాన్ని తగలపెట్టించిన హిట్లర్..ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టిన విధంగా.. సీఎం జగనే దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం జగన్ తీరు హిట్లర్ ఉదంతాన్ని తలపిస్తోంది
సీఎం జగన్ తీరు హిట్లర్ ఉదంతాన్ని తలపిస్తోంది

By

Published : Jan 12, 2021, 8:35 PM IST

దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్ ప్రకటన.. హిట్లర్ ఉదంతాన్ని తలపించేలా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. జర్మనీ పార్లమెంట్ భవనాన్ని తగలపెట్టించిన హిట్లర్..ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టిన విధంగా.. సీఎం జగనే దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దాడుల ఉన్మాదాన్ని ముఖ్యమంత్రి జగన్ విడనాడకపోతే..చారిత్రక తప్పిదం చేసిన వారవుతారని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కుల, మత, ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

సీఎం జగన్ చెల్లెలి భర్త అనిల్ నేతృత్వంలోనే రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. పేద, దిగువ మధ్యతరగతి హిందువుల్లో భయాందోళనలు రేకెత్తించి వారిని మతమార్పిడి దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

ఇదీచదవండి:జగన్, విజయసాయి వాదనలు ఆఖరున వింటాం: సీబీఐ,ఈడీ కోర్టు

ABOUT THE AUTHOR

...view details