ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబును అడ్డుకోవటం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం' - వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమా విమర్శలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామతీర్థంలో జరిగిన ఘటనను పరిశీలించడానికి వెళ్లిన చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేయడమేనని దేవినేని ఉమా ఆరోపించారు.

Devineni Uma
మాజీ మంత్రి దేవినేని ఉమా

By

Published : Jan 2, 2021, 8:15 PM IST

హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా కుట్ర చేయడం దారుణమని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనను పరిశీలించడానికి వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసుల అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ పాలనకి అద్దం పడుతుంది అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details