5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ప్రజారాజధాని నిర్మాణానికి అన్ని వర్గాల రైతులు ౩౩వేల ఎకరాలు త్యాగం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమా కొనియాడారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా 130 రోజులుగా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే.... వీరి గోడు ప్రభుత్వానికి కనిపించడం లేదాంటూ ఉమా మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా గౌరవించకుండా... విశాఖపట్నంకు రాజధాని మార్పు నిర్ణయం జరిగిపోయిందన్న వైకాపా నాయకుల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ట్విటర్లో డిమాండ్ చేశారు.
'తమ పార్టీ నేతల వ్యాఖ్యలకు ఏ సమాధానం చెబుతారు సీఎం గారూ' - former minister devineni uma
కోర్టు ఆదేశాలు పాటించకుండా...విశాఖపట్నానికి రాజధాని మార్పు నిర్ణయం జరిగిపోయిందన్న వైకాపా నేతల వ్యాఖ్యలకు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తెదేపా నేత దేవినేని ఉమా ట్విటర్లో ప్రశ్నించారు.
తెదేపా నేత దేవినేని ఉమా