ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2021, 5:13 PM IST

ETV Bharat / city

పోలవరం నిర్వాసితుల వద్దకు వెళ్లే ధైర్యం ఉందా?: దేవినేని ఉమ

పోలవరం పనుల్లో జాప్యం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ప్రాజెక్ట్ ఎప్పుడూ పూర్తవుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయని చెప్పారు.

deveneni uma
deveneni uma

పోలవరం కోసం రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఎన్నో అబద్ధాలు చెప్పారని.. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల వద్దకు వెళ్లే ధైర్యం ఉందా అని జగన్​ను ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు.

71.2 శాతం పూర్తయిన నిర్మాణ పనులను నిలిపేశారని ఆరోపించారు. వందల కోట్లు స్వాహా చేసేందుకే జగన్ రివర్స్ టెండరింగ్‌ డ్రామాలు ఆడారని విమర్శించారు. రాక్ ఫీల్ డ్యామ్‌ పనులు ఆగడంతో సీజన్ పనులు వృథా అయ్యాయని.. ప్రగల్బాలు ఆపి పోలవరం రెండేళ్లలో ఎంత శాతం పని పూర్తి చేశారు? ఎప్పుడు ప్రాజెక్టును పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. 14 ప్రాజెక్టులు పూర్తి చేశామని అసత్యాలు చెబుతున్నారని.. వాటి పేర్లేంటో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలి: మంత్రి అనిల్ కుమార్

ABOUT THE AUTHOR

...view details