కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని వలివెత్తిపాడు పంచాయతీలో 66 మంది ప్లాట్లు కొనుగోలు చేస్తే... ఇప్పుడు మంత్రి కొడాలి నాని వారిని ఖాళీ చేయాలని బెదిరిస్తుండటం దారుణమని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. దుర్మార్గాన్ని ప్రశ్నించిన టీచర్ మీద దాడికి పాల్పడిన కొడాలి నానిని భర్తరఫ్ చేసి కేసు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని వ్యాఖ్యానించారు.
'కొడాలి నానిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి' - మాజీ మంత్రి దేవినేని
మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తే. .మంత్రి కొడాలి నాని వారిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసి కేసు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని వ్యాఖ్యానించారు.

'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలి'
తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న సీఎంకు మంత్రుల అరాచకాలు వినపడవు, కనపడవని ఎద్దేవా చేశారు. మంత్రులు బూతులు తిడుతూ... బుల్లెట్లు దింపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ... నీటి పారుదల శాఖ మంత్రి తన సొంత జిల్లాలో రెండో పంటకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.