ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగునీటి రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు: దేవినేని - సాగునీటి రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు: దేవినేని ఉమ

ఏడాదికాలంలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ భ్రష్టుపట్టించారని మాజీమంత్రి దేవినేని మండిపడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టు పనులను ఆపేశారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సాగునీటి రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు: దేవినేని
సాగునీటి రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు: దేవినేని

By

Published : Jun 9, 2020, 2:07 PM IST

కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర సాగునీటి రంగాన్ని అయోమయ పరిస్థితుల్లోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఏడాదికాలంలో సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడితే పనులు జరగవని హితవు పలికారు. ఏడాది కాలంలో సాగునీటి రంగంలో ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. 800 అడుగుల్లో ముచ్చుమర్రి జలాలు కేసీ కెనాల్‌కు, హంద్రీనీవా వంటి వాటికి వెళ్తాయని... పనులు ఆపడానికి కారణమేంటో చెప్పాలన్నారు.

వైకుంఠపురం టన్నెల్‌ బ్యారేజీ పనులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. వంశధార-నాగావళి అనుసంధానం తాము మొదలుపెట్టింది కాదా..? అని నిలదీశారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు నడుస్తున్నాయని..రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టు పనులను ఆపేశారన్నారు. సమగ్ర జలవిధానంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details