గతంలో ఏడుకొండలెందుకు రెండుకొండలు చాలని వైఎస్ అంటే.. నేడు జగన్ కలియుగ దైవం వెంకన్న భూములు వేలానికి పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూను మార్కెట్లో పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. కోట్లాది మంది భక్తుల, దాతల మనోభావాలు దెబ్బతీసే హక్కు జగన్, ఆయన చిన్నానకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.ఈ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు' - భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు: దేవినేని
కోట్లాది మంది భక్తుల, దాతల మనోభావాలు దెబ్బతీసే హక్కు జగన్, ఆయన చిన్నాన వైవీ సుబ్బారెడ్డికి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ప్రశ్నించారు. గతంలో ఏడుకొండలెందుకు రెండుకొండలు చాలని వైఎస్ అంటే.. నేడు జగన్ కలియుగ దైవం వెంకన్న భూములు వేలానికి పెట్టారని మండిపడ్డారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు: దేవినేని
బడ్జెట్‌లో లక్షా 73వేల కోట్ల లెక్కలు చెప్పే దైర్యం ప్రభుత్వానికి ఉందా అని ఉమ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ద్వారా తెచ్చుకున్న 70వేల కోట్లు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎంతని నిలదీశారు. రాష్ట్రం అప్పుగా తెచ్చిన 82వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైకాపాకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలన్నారు.