ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం... రివర్స్ పాలన: దేవినేని ఉమ - రద్దుల ప్రభుత్వం రివర్స్ పాలన

మూడు నెలల్లో రాష్ట్రం సాధించిన ఘనతను చెప్పుకోలేని స్థితిలో సీఎం ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం.. రివర్స్ పాలన చేస్తోందన్నారు.

రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం...రివర్స్ పాలన  : దేవినేని ఉమ

By

Published : Sep 13, 2019, 6:38 PM IST

రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం...రివర్స్ పాలన : దేవినేని ఉమ

పోలవరం సహా రాష్ట్రంలో పలు జలవనరుల ప్రాజెక్టులు ఎందుకు నిలుపుదల చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన గత 3 నెలల నుంచి రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని విమర్శించారు. జగన్‌ కక్షపూరిత పాలన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం సాధించిన ఘనత చెప్పుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు.

ఎక్కడ చూసినా తెదేపా ప్రభుత్వం అభివృద్ధే జగన్​కు కనిపిస్తోందన్న ఉమా... తెదేపాపై అవినీతి బురద చల్లడానికే జగన్ తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించారు. వరదల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం గేట్లు ఎత్తిన వివాదంపై కేంద్ర జలసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు. జలవనరుల ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెదేపా హయాం జరిగిన అభివృద్ధికి నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్ నిదర్శమన్నారు. పీపీఏలపై కోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు... మాజీ మంత్రి ఉమా.

ABOUT THE AUTHOR

...view details