ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరానికి పెడతానన్న గేట్లు ఎక్కడ ?: దేవినేని ఉమా

ప్రజలు వైకాపాకు అధికారం కట్టబెట్టింది విగ్రహాలు పెట్టుకోవటానికి కాదని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. నవంబరు కల్లా పోలవరం గేట్లు పెడతానన్న సీఎం జగన్ వాటిని ఎక్కడ పెట్టారో చూపాలని డిమాండ్ చేశారు.

పోలవరానికి పెడతానన్న  గేట్లు ఎక్కడ ?: దేవినేని ఉమా
పోలవరానికి పెడతానన్న గేట్లు ఎక్కడ ?: దేవినేని ఉమా

By

Published : Nov 23, 2020, 9:19 PM IST

నవంబర్​ కల్లా పోలవరం గేట్లు పెడతానన్న జగన్ వాటిని ఎక్కడ పెట్టారో చూపాలని మాజీమంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి గేట్లు పెడతామంటే సాధ్యమయ్యే పని కాదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసింది విగ్రహాలు పెట్టుకోవటానికి కాదని హితవు పలికారు.

"151అడుగుల సామర్థ్యం నీటినిల్వతో పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని 5 కోట్లమంది ప్రజలు అడిగే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వామపక్ష నాయకులు పోలవరం సందర్శనను అడ్డుకోవటంతో మరోమారు పోలీసు రాజ్యాన్ని చూపించారు. తెదేపా హయాంలో పనులు జరుగుతుండగానే ఒక్కరోజులో 600 బస్సుల్లో 30 వేల మంది ప్రజలు సందర్శనకు వెళ్లారు. 15 మంది వామపక్ష నేతలను రానివ్వకుండా అడ్డుకునేందుకు వందలమంది పోలీసులను కాపలా పెట్టడం అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందనే దుర్మార్గంగా వ్యవహరించారు. పోలవరం గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం, జగన్​కు లేకే మంత్రులతో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారు. పోలవరం ఏ షెడ్యూల్ ప్రకారం నడుస్తుందో ట్వీట్ చేసిన ఎంపీ విజయసాయి సమాధానం చెప్పాలి" -దేవినేని ఉమా

ABOUT THE AUTHOR

...view details