ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపాతోనే నగర అభివృద్ధి సాధ్యం: దేవినేని అవినాశ్ - దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారం

వైకాపా అభ్యర్థిని గెలిపించి విజయవాడ 19వ డివిజన్‌ అభివృద్ధికి కృషి చేయాలని నగర తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ ఓటర్లను కోరారు. నరగరపాలక ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించిన ఆయన..వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

వైకాపాతోనే నగర అభివృద్ధి సాధ్యం
వైకాపాతోనే నగర అభివృద్ధి సాధ్యం

By

Published : Mar 5, 2021, 4:23 PM IST

విజయవాడ పున్నమి తోట పరిధిలోని 19వ డివిజన్​లో వైకాపా అభ్యర్థి రెహానా నాహీద్‌ తరపున విజయవాడ తూర్పు నియోజక వర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థిని గెలిపించి డివిజన్‌ అభివృద్ధికి కృషి చేయాలని ఓటర్లను కోరారు. నిత్యం ప్రజలతో మమేకమై..సమస్యల కృషికి పాటు పడతానని అభ్యర్థి రెహానా నాహీద్ స్పష్టం చేశారు. డివిజన్ అభివృధ్ధిలో భాగంగా షాదీఖానా నిర్మాణం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, కాల్వగట్ల సుందరీకరణ వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details