ప్లాట్ల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిన ఎంకే కన్ స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్లలో ఒకరిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ నిందితుడిని విచారిస్తున్నారని.. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
కంపెనీ డైరక్టర్లుగా పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్, రవితేజ చెలామణి అయ్యారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వెంచర్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెంచర్ల పేరుతో నగదు వసూలు చేశారు. ఇప్పటి వరకు ఆరుకోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇదీ చదవండి: