విజయవాడ నగరంలో ముస్లిం పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దర్గాలను త్వరగా అభివృద్ధి చేయాలని, దర్గా నిర్మాణంతోపాటు అన్ని విధాలా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ప్రసిద్ధి గాంచిన దర్గా హజరత్ సయ్యద్ షా అలీ హుస్సేన్ షా ఖాద్రి దర్గాలను ప్రభుత్వం త్వరగా అభివృద్ధి చేయాలని కొండపల్లి షాబుఖారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
'దర్గాలను ప్రభుత్వం త్వరగా అభివృద్ధి చేయాలి' - Hazrat Syed Shah Ali Hussain Shah Qadri Dargah
విజయవాడలోని హజరత్ సయ్యద్ షా అలీ హుస్సేన్ షా ఖాద్రి దర్గాలో మత గురువులు ప్రార్ధనలు చేశారు. దర్గాలను ప్రభుత్వం త్వరగా అభివృద్ధి చేయాలని కొండపల్లి షాబుఖారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
'దర్గాలను ప్రభుత్వం త్వరగా అభివృద్ధి చేయాలి'
విజయవాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మైనార్టీ మంత్రి అంజాద్ బాషాలు స్పందించి దర్గాకు పూర్తిగా న్యాయం చేయాలని, దర్గా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. విజయవాడ సూఫీ మత గురువులు సయ్యద్ నజీరుద్దీన్ బాబా వారి భక్తులు షంషి కలీం హఫీజ్ సయీద్ భాషా రెహమాన్ అంజాద్ హుసేన్ తదితర భక్తులు పాల్గొన్నారు.