పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఉపసభాపతి కోన రఘుపతి పరిశీలించారు. కుటుంబ సమేతంగా పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన ఆయనకు జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టులోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్, క్రస్ట్ గేట్ల నిర్మాణం తదితర నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ దాదాపు 69శాతం పూర్తైయినట్టుగా అధికారులు వివరించారు.
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఉపసభాపతి కోన రఘుపతి - పోలవరాన్ని సందర్శించిన కోన రఘుపతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఉపసభాపతి కోన రఘుపతి పరిశీలించారు. ప్రాజెక్టులోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పనుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
![పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఉపసభాపతి కోన రఘుపతి deputy speaker kona raghupathi visits polavaram project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10188925-324-10188925-1610272040355.jpg)
పోలవరం పనులను పరిశీలించిన ఉపసభాపతి కోన రఘుపతి