'రక్షణ, సమగ్ర సమాచారం కోసం వక్ఫ్ బోర్టు ఆస్తుల డిజిటలైజేషన్' - ఏపీ వక్ఫ్ బోర్టు ఆస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్టు ఆస్తుల పరిరక్షణ, సమగ్ర సమాచార లభ్యత దిశగా.. ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
!['రక్షణ, సమగ్ర సమాచారం కోసం వక్ఫ్ బోర్టు ఆస్తుల డిజిటలైజేషన్' deputy cm amjad basha video conference with officials on wakf Board Assets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9077033-thumbnail-3x2-dupty-cm.jpg)
వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ బాధ్యత డీఆర్వోలదేనని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. డీఆర్వోల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రక్షాళనలో భాగంగా ఆక్రమణల నుంచి రక్షణతో పాటు సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్టు ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు వివరించారు. సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.