ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇమామ్​లు, మౌజన్లకు పెంచిన గౌరవ వేతనాన్ని చెల్లించాం' - ఉపముఖ్యమంత్రి బాషా తాజా వార్తలు

5 వేల మంది ఇమామ్​లు, మౌజన్లకు పెంచిన గౌరవ వేతనాన్ని మే, జూన్ నెలలకు 14 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించామని ఉపముఖ్యమంత్రి (మైనారిటీ సంక్షేమం) అంజాద్ బాషా వెల్లడించారు. మసీదు కమిటీల జాయింట్ ఖాతాల్లో ఈ గౌరవ వేతనాన్ని జమ చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు.

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష

By

Published : Aug 10, 2021, 5:10 PM IST

2021 - 22 ఆర్ధిక సంవత్సరంలో 5 వేల మంది ఇమామ్​లు, మౌజన్లకు పెంచిన గౌరవ వేతనాన్ని మే, జూన్ నెలలకు 14 కోట్ల రూపాయలను చెల్లించామని ఉపముఖ్యమంత్రి (మైనారిటీ సంక్షేమం) అంజాద్ బాషా వెల్లడించారు.

మసీదు కమిటీల జాయింట్ ఖాతాల్లో ఈ గౌరవ వేతనాన్ని జమ చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని 7.38 కోట్ల రూపాయలు త్వరలోనే మసీదు కమిటీల ఖాతాల్లో జమ అవుతాయని ఆయన ప్రకటించారు. ఎలాంటి జాప్యమూ లేకుండా మసీదు కమిటీలు ఇమామ్, మౌజన్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details