ఆర్థిక సంక్షోభం, ఇతర ప్రతికూల పరిస్థితులకు తోడు గత ఏడాది కరోనా మహామ్మారి వలస జీవులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్ దేశాల్లోని 30 శాతం మంది వరకు ప్రవాస భారతీయులే కాగా అందులో 4 శాతం వరకు తెలంగాణ వారు. ఉపాధి కరవై 1970 నుంచి గల్ఫ్‌లోని సౌదీ ఆరేబియా, బహరైన్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కువైట్, ఒమన్, ఖతర్‌లకు తెలంగాణ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎక్కువ మంది ముడి ఇంధన సంస్థలతో పాటు నిర్మాణాల్లో, ఇతర వృత్తుల్లో పనిచేసేందుకు వెళ్లారు.
ఉద్యోగాలపై వేటు
గల్ఫ్ సంక్షోభాల కారణంగా చమురు సంస్థలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులను తొలగించాయి. వాటి అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులను ఇంటికి పంపించారు.దీంతో కువైట్, ఒమన్‌లలోని ప్రవాసులు తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. మరోవైపు నిర్మాణ రంగం కుదేలయింది. సౌదీ, యూఏఈలో పెద్దఎత్తున ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఖతర్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల కోసం పెద్దఎత్తున స్టేడియాల నిర్మాణాలను ఆ దేశం నిర్మించింది. ఆర్థికమాంద్యం కారణంగా అక్కడా భారతీయ ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సంక్షోభాల కారణంగా వ్యయాలను తగ్గించుకునే పనిలో భాగంగా గల్ప్ దేశాలు తమ దేశాల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపించేందుకు క్షమాభిక్ష ప్రకటించాయి. ఆరు దేశాల్లోనూ ఇది సాగింది.
కరోనాతో...