ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాళ్లరిగేలా తిరిగుతున్నా... కారుణ్య నియామకాలు చేపట్టరా? - jobs

కారుణ్య నియామకాలు చేపట్టాలని కొందరు అభ్యర్థులు విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఆప్తులను పోగొట్టుకున్న తమకు అండగా నిలబడతామన్న అధికారులు... ఇప్పుడు మాట మార్చి, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందారు.

కాళ్లరిగేలా తిరిగుతున్నా...కారుణ్య నియామకాలు చేపట్టారా?

By

Published : Aug 13, 2019, 9:26 PM IST

కాళ్లరిగేలా తిరిగుతున్నా...కారుణ్య నియామకాలు చేపట్టారా?

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద పలువురు ఆందోళన చేశారు. గత ప్రభుత్వ కాలంలో అధికారులు.. కారుణ్య నియమాకాలు చేపట్టడానికి ఆమోదం తెలిపి, తమ నుంచి సర్టిఫికెట్​లు తీసుకున్నారని అభ్యర్థిని ముంతాజ్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ గోడు అసలు పట్టించుకోవడంలేదని వాపోయారు. జనవరి నుంచి ఉద్యోగాల కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.

కారుణ్య నియామకం

ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న వ్యక్తి హఠాన్మణం చెందితే.. ఆ వ్యక్తి కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం కల్పిస్తారు. అనారోగ్య కారణాలతో సదరు ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తారు.

ఇదీ చదవండి:

వామ్మో.. ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details