కృష్ణా జిల్లా, నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో స్నానం చేస్తున్న ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. కాగా వారిలో ఒకరి మృత దేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
నాగాయలంక పుష్కరఘాట్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత దేహం - నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం పుష్కరఘాట్
కృష్ణా నది తీరంలో నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం పుష్కరఘాట్ ఒడ్డుకు ఓ మృత దేహం కొట్టుకు వచ్చింది. మృతుడు ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. గల్లైంతైన మరో వ్యక్తికోసం నదిలో గాలింపులు చేపట్టారు.
మృత దేహం
మృతుడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి భట్టిప్రోలుకు చెందిన పరాచీ పవన్ కుమార్ అని, అతని కోసం గజ ఈత గాళ్లు గాలిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు యువకులు కారులో వచ్చి ఘాట్ వద్ద స్నానం చేసేందుకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:fishermen missing: బంగాళాఖాతంలో 12 మంది మత్స్యకారులు గల్లంతు