ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

dead body in refrigerator: ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం.. ఏం జరిగింది? - వరంగల్​ రూరల్​ జిల్లా తాజా వార్తలు

తాత మృత దేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిజ్​లో దాచిపెట్టిన ఘటన తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం
ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం

By

Published : Aug 12, 2021, 5:08 PM IST

అంత్యక్రియలకు డబ్బుల్లేవని తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన విశ్రాంత ఉద్యోగి బాలయ్య (93) తన మనవడు నిఖిల్‌తో కలిసి పరకాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో 3 రోజుల క్రితం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతో తాత మృతదేహాన్ని నిఖిల్‌ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టాడు. గురువారం చుట్టుపక్కల వారికి బాలయ్య ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని ఫ్రిజ్‌లో ఉన్న శవాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతోనే మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టానని నిఖిల్‌ స్థానికులు, పోలీసులకు వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details