లాక్‌డౌన్ కాలంలో నిత్యం పరిశుభ్రతకు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణలోని మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని డీడీఎస్ ఆధ్వర్యంలో రాగులతో తయారు చేసిన అంబలిని 20 రోజులుగా పంపిణీ చేస్తున్నారు. అంబలిలోని పోషకాలు ఇతరత్రా ప్రాముఖ్యతలను కేవీకే శాస్త్రవేత్త భార్గవి వివరించారు.
అంబలి ద్వారా కలిగే ప్రయోజనాలు...
చిరుధాన్యాలైన రాగుల ద్వారా వంటకాలు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొద్దిపాటి తీపిని కలిగి ఉండే రాగుల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెర నిల్వలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటం, పెద్ద పేగుకు కావాల్సిన నీటి నిల్వలు అందుతాయి. తద్వారా మలబద్దకం దూరమవుతుంది.